♪♫
TG-4407
Telugu
విలువైనది సమయము
Viluvainadhi Samayamu
0
views
పల్లవి
విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2) సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||
1వ చరణం
క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల (2) గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||
2వ చరణం
శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2) సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||
3వ చరణం
క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు (2) సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||