TG-4408
Telugu

విలువైనది నీ ఆయుష్కాల

Viluvainadi Nee Aayushkaalam

0
views
పల్లవి

విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||

1వ చరణం

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||

2వ చరణం

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||