విలువైనది నీ జీవితం యేసయ్యకే

viluvainadi nee jeevitham yeesayyakee

🎵 TG-2167🌐 Telugu
పల్లవి

విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం (2) ఆ దేవ దేవుని స్వరూపంలో నిను చేసుకున్న ప్రేమ తన రూపులో నిను చూడాలని నిను మలచుకున్న ప్రేమ ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ తన కంటి రెప్పలా – నిను కాచేటి క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది||

1వ చరణం

ప్రతి అవసరాన్ని తీర్చే నాన్న మన ముందరుండగా అనుక్షణమున నీ చేయి విడువక ఆయనీతో నడిచెగా ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా నిను విడిపించే దేవుడుండగా అసాధ్యమేముంది – నా యేసయ్యకు సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు

Report Error