TG-1360
Telugu

విలువేలేని నా జీవితం

viluveeleeni naa jeevitam

Moses Danyపాస్టర్ వినోద్ కుమార్ · Pastor Vinod Kumarప్రవీణ్ , కావ్య , రెబెక్కా , బ్యూలాహ్ · Praveen , Kavya , Rebecca , Beulah
84
views
పల్లవి

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2)

1వ చరణం

నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

2వ చరణం

పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||

3వ చరణం

పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది||

బ్రిడ్జి

సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2)

ఇతర

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.