♪♫
186
views
పల్లవి
విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల హృదయ||
1వ చరణం
అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల హృదయ||
2వ చరణం
నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల హృదయ||
3వ చరణం
భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా ||విమల హృదయ||
4వ చరణం
పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా ||విమల హృదయ||
5వ చరణం
నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల హృదయ||
6వ చరణం
ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల హృదయ||