విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు నెనరుచే ననుఁ గావు మెప్పుడు ||విన రమ్ము||
ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే తెంతు నంటివి ||విన రమ్ము||
మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ దెరవుఁ దెల్పి నావు నీవెగా ||విన రమ్ము||
మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ దు రాత్ముని నాపై ||విన రమ్ము||
సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన నుర్వి లేదుగా ||విన రమ్ము||
కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి నడుపు మరణావధికి ||విన రమ్ము||
వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి యనుభవంబుఁ గలుగఁ జేయవే ||విన రమ్ము||
దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె నేఁ పాప నరుఁడను ||విన రమ్ము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.