TG-3492
Telugu

వినరయ్య వినరయ్య - యేసు ప్రభావము

vinarayya vinarayya - yeesu prabhaavamu

Jonah Samuelఎం. దేవదాస్ అయ్యగారు · M. Devadas Ayyagaruడాక్టర్. పీ సజీవ రావు · Dr. P Sajeeva Rao
0
views
Chorus

వినరయ్య వినరయ్య - యేసు ప్రభావము - గనరయ్య క్రీస్తుని ఘన కార్యంబు = మనసు యేసుని కథపై - మలపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరకు|| వినరయ్య ||

1వ చరణం

కుసుమ రోగియైన - కోమలి యొకరు నీ - రసమై పోవుచు మిగుల వ్యసన పడుచుండెన్ = బస విడిచి దారిలో - ప్రభు యేసునిన్ జూడ - నిసు మంతైన సందే - హింపదాయె|| వినరయ్య ||

2వ చరణం

పన్నెండేండ్ల నుండి - పరమ వైద్యుల యొద్ద మందు బుచ్చుకొనిన మానదాయె = ఇన్నాళ్ళకీ వేళ - యేసు చెంగు ముట్ట - నిడుమ లన్నిటి నుండి - విడుదలాయె|| వినరయ్య ||

3వ చరణం

తన జబ్బు పోవును - అని యామె యనుకొన్న - అనుకొనుట విశ్వాస - మాయె ముదిరి = అనుకొన్నట్టే జబ్బు - అంతర్దానమాయె అనుకొనుటే కష్టంబా - అదరుట కన్న|| వినరయ్య ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.