TG-104
Telugu

వినరే యో నరులారా వీనుల

vinaree yoo narulaaraa veenula

202
views
పల్లవి

వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే యో||

1వ చరణం

నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే యో||

2వ చరణం

ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే యో||

3వ చరణం

పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే యో||

4వ చరణం

ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును ||వినరే యో||

5వ చరణం

దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగఁ జనె బిరబిర మన మం దర మా కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే యో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.