TG-5714
Telugu

విరిగిన మనసా నీకు గాయమాయాన కోరినవన్నీ

Virigina Manasaa Neeku Gaayamaayaana Koorinavannee

0
views
పల్లవి

విరిగిన మనసా నీకు గాయమాయాన కోరినవన్నీ నీకు దూరమాయాన (2) స్థితిని మార్చేది యేసే కలతలు తీర్చేది క్రీస్తే (2) ||విరిగిన||

1వ చరణం

నా అన్నవారే నిన్ను వెలివేసిన నీకున్నవారే నిను విడిచి వెళ్ళిన (2) అంధకారములో ఆగిపోయిన అనాథగా నీవు మిగిలిపోయిన (2) స్థితిని మార్చేది యేసే కలతలు తీర్చేది క్రీస్తే (2) ||విరిగిన||

2వ చరణం

పలుమార్లు నీవు మోసపోతివే పగిలిన పాత్రగా మిగిలిపోతివే (2) చావు నీకు సరికాదులే కష్టము కడదాక నిలిచిపొదులే (2) స్థితిని మార్చేది యేసే కలతలు తీర్చేది క్రీస్తే (2) ||విరిగిన||