TG-4418
Telugu

వివాహమన్నది పవిత్రమైనది

Vivaahamannadi Pavithramainadi

23
views
పల్లవి

వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2) ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2) నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

1వ చరణం

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2) శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

2వ చరణం

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2) వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.