TG-4419
Telugu

యాకోబు బావి కాడ

Yaakobu Baavi Kaada

25
views
పల్లవి

యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2) దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2) నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు||

1వ చరణం

అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2) నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2) చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు||

2వ చరణం

అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2) అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2) లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు||

3వ చరణం

నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2) వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2) ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు||

4వ చరణం

నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2) గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2) తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.