TG-4421
Telugu

యవ్వనుడా యవ్వనుడా

Yavvanudaa Yavvanudaa

0
views
పల్లవి

యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? యవ్వనుడా యవ్వనుడా నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా||

1వ చరణం

దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2) యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2) అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా||

2వ చరణం

అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము ఇతరులకొక మాదిరిగా జీవించుము (2) పాపమనే చీకటిలో ఉన్నవారిని (2) నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా||

3వ చరణం

యవ్వనుడా యవ్వనుడా ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా Maati Maatiki Aela Padipovuchunnaavu? Nee Paapa Jeevithamlo Inka Ennaallu Saagedavu? ||Yavvanudaa||