యవ్వనులారా మీరు
Yavvanulaaraa Meeru
యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు – (2) ఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||
ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా||
చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) ప్రభు కొరకు ప్రకాశించుచు (2) ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా||
నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా (2) ఆయననే తిని త్రాగుచూ (2) ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా||
మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం (2) మన జీవము వృద్ధి నొందుచూ (2) ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.