TG-3141
Telugu

యేసయా… యేసయా…(నీవు తోడుండగా)

yeesayaa… yeesayaa…(neevu toodundagaa)

Ashirvad Lukeడాక్టర్. రాజ్ అలంక · Dr. Raj Alankaసుసాన్నె ఎస్తేర్ గెడ్డం & సామి పాచిగాళ్ళ · Susanna Esther Geddam & Samy Pachigalla
17
views
పల్లవి పూర్వ భాగం

యేసయా… యేసయా… ఆరాధన నీ..కే… ఆరాధన… నీవు తోడుండగా… నాకు భయమెలను… నీవు ముందుండగా… నా…దే… జయమె…ప్పుడు…

పల్లవి

నీవు తోడుండగా నాకు భయమెలను నీవు ముందుండగా నాదే జయమెప్పుడు (2) కొండలైనా లోయలైన - సంద్రమైన ఎడారియైన కలతలైన కన్నీరైన - ఒంటరైన ఓటమైనా నాకు దిగులెందుకు సాగేదా ముందుకు (2) యేసయా యేసయా - స్తోత్రం హల్లేలూయా ఆరాధన ఆరాధన - నీకే ఆరాధన

1వ చరణం

వాగ్దానమిచ్చిన దేవుడవు - మాటతప్పని వాడవు కాలాలు మారిన తరాలు మారినా - మారని వాడవు చెరిగిపోనిది నీ నిబంధన - తరిగిపోనిది నీ దయ కొలతలేనిది నీదు ప్రేమ - తొలగిపోనిది నీ కృప

2వ పల్లవి

నా దేవుడ నీవేనయా.. నీవు తప్ప దిక్కెవరయ్యా (2) యేసయా యేసయా - స్తోత్రం హల్లేలూయా (2) ఆరాధన ఆరాధన - నీకే ఆరాధన

2వ చరణం

తల్లితండ్రులు మర..చినా - మరువని దేవుడవు బంధుమిత్రులు విడ..చినా - విడువని నాధుడవు సోలిపోయిన వేళలోనా - స్నేహమై కాపా…డినావు చితికిపోయే జీవితాలను - చిత్తమై బతికించినావు ||నా దేవుడ నీవేనయా||

3వ చరణం

ఎర్రసముద్రం ఎదురైనా – దారి తెరిచిన దేవుడవు సింహాలగుహలో పడవేసినా – తోడు నిలచిన రాజుడవు అగ్ని గుండం లోనైనా – కలసి నడిచిన ఆప్తుడవు ఓడిపోయె జీవితానికి – గెలుపు నిచ్చిన నాధుడవు ||నా దేవుడ నీవేనయా|| ||నీవు తోడుండగా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.