యేసయ్య జన్మించే ఈ నేలపై సంబరాలు చేసేద్దాం ఏకమై
Yeesayya Janminchee Ee Neelapai Sanbaraalu Cheeseeddaan Eekamai
యేసయ్య జన్మించే ఈ నేలపై సంబరాలు చేసేద్దాం ఏకమై (2) లోకమును ప్రేమించి వచ్చిన ప్రియ కుమారునికై (2) ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం లోకాన చాటేద్దాం (2) ||యేసయ్య||
కన్నె మరియా గర్భమున దైవసుతుడే జన్మించెను జనన వార్తతో లోకమంతా శుభ దినాలే మొదలాయెను (2) రక్షకుడే ఇలకొచ్చెను రక్షణతో మనలను నడిపెను (2) మనతో ఒకరిగా ఉండెను ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం లోకాన చాటేద్దాం (2) ||యేసయ్య||
సంతోషాలను పంచుకునే దూత శుభవార్తనే తెచ్చెను అవధులు లేని ఆనందంతో ధరణియె ఉప్పొంగెను (2) ప్రవచనాలే నెరవేరేను శ్రమదినాలే ఇక పోయెను మనలో శాంతినే నింపెను ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం లోకాన చాటేద్దాం (2) ||యేసయ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.