యేసయ్య పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు
Yeesayya Puttaadu Manakai Puttaadu Santhooshan Thechchaadu
యేసయ్య పుట్టాడు - మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు - సందడి తెచ్చాడు (2) అంత కలిసి మనం క్రిస్మస్ పాటలతో అంత కలిసి మనం చేద్దామా సందడి క్రిస్మస్ పాటలతో ఊరంత సందడి (2) యూదయ దేశములో రాత్రి సమయములో మందలు కాస్తున్న గొర్రెల కాపరులు గొప్ప వెలుగొకటి చూసి భయపడగా దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది (2) మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది రక్షకుడేసయ్య జాడ చక్కగా తెలిపింది రక్షకుడేసయ్య జాడ చక్కగా తెలిపింది ఆకాశము నందు ఆశ్చర్యము గొలిపే వింత చుక్కొకటి తూర్పుగా వెలిసింది తూర్పు దేశములో జ్ఞానుల కందరికి గొప్ప వార్త చుక్క నడిపిస్తూ తెలిపింది సక్క సక్కాని వార్త చక్కగా తెలిపింది సక్క సక్కాని వార్త చక్కగా తెలిపింది రాజులకు రాజైన యేసు చెంత చేర్చింది రాజులకు రాజైన యేసు చెంత చేర్చింది యేసయ్య పుట్టాడు - మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు - సందడి తెచ్చాడు అంత కలిసి మనం క్రిస్మస్ పాటలతో అంత కలిసి మనం చేద్దామా సందడి క్రిస్మస్ పాటలతో ఊరంత సందడి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.