♪♫
TG-3374
Telugu
యేసయ్యా నా దేవుడా- నా పాపమంతా కడుగవా
yeesayyaa naa deevudaa- naa paapamantaa kadugavaa
Ashirvad LukeFullness of Joy Ministriesడేనియల్ సూర్య ఆవుల · Daniel Surya Avulaజాన్ నిస్సై · John Nissy
0
views
Chorus
యేసయ్యా నా దేవుడా నా పాపమంతా కడుగవా (2) మనస్సంతా ఆలోచన హృదయమంతా భారమేనయ్యా (2) ||యేసయ్యా||
1వ చరణం
వ్యర్ధమైన వాంఛలలో బ్రతికానయ్యా ధనమంతా బలమంతా పోయిందయ్యా (2) అంధకార బాటలలో నడిచానయ్యా జీవమునకు మార్గమును విడిచానయ్యా (2) ||యేసయ్యా||
2వ చరణం
బ్రతికించే నీవాక్యం వినలేదయ్యా వంచించే మాటలనే నమ్మానయ్యా (2) అపవాది మోసాలకు కూలానయ్యా లేవలేని స్థితిలో నేనున్నానయ్యా (2) ||యేసయ్యా||
3వ చరణం
పరిశుద్ధుని పాదాలను విడిచానయ్యా నా బలమునే నేను ఆశ్రయించానయ్యా (2) కన్నులలో నీభయము లేదేమయ్యా దోషినై నీఎదుటనే నిలిచానయ్యా (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
