TG-2109
Telugu

యేసయ్యా నా దొరా నీ

yeesayyaa naa doraa nee

68
views
పల్లవి

యేసయ్యా నా దొరా నీ సాటి ఎవరయ్యా ఈ ధర నా కోసమే వచ్చిన సర్వేశ్వరా నను విడిపించిన కరుణాకరా మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా వేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా||

1వ చరణం

మండే నా బ్రతుకే పాటగా నిండైన నీ బ్రతుకే బాటగా (2) పండంటి నీ ప్రేమ తోటలో మెండైన నీ వాక్యపు ఊటలో దొరికింది నా వరాల మూట సప్త స్వరాలే చాలవింక నా నోట నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా మిగిలిన శ్రమలను సంతర్పణలో కదిలే కన్నీటి అర్చనలో పండింది నా నోముల పంట ఎంత పంచినా తరగదు ఈ దేటంట నా దాగు చోటు నీవేనయ్యా చికాకు పడక నన్ను కాచేవయ్యా ఏకాకి నేనింక కాబోనయ్యా నీ రాక కోసమే ఉన్నానయ్యా శ్రీమంతుడా సాత్వికుడా పరిపూర్ణుడా కడు దీనుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.