యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
yeesayyaa naa hrudayaabhilaassa neeveenayyaa
🎵 TG-1197🌐 Telugu
పల్లవి
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా (2)
1వ చరణం
పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు (2) పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా ||యేసయ్యా||
2వ చరణం
ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2) విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా (2) ||యేసయ్యా||