TG-3060
Telugu

యేసయ్యా నా ప్రియుడా

yeesayyaa naa priyudaa

Sareen Immanకీర్తన & సంకీర్తన · Keerthana & Sankeerthana
17
views
పల్లవి

యేసయ్యా.... నా ప్రియుడా...... యేసయ్యా..... నా ప్రాణమా.. జీవ దాత ప్రాణదాత త్రియేక దైవమా.. శక్తి దాత ముక్తి దాత పరిశుద్ధ దైవమా.. ..(2) నీకేనయ్యా ..ఈ ఆరాధనా... నీకేనయ్యా... నా స్తోత్రార్పణా....

1వ చరణం

అదృశ్యుడా.. అతికాంక్షనీయుడా.. అద్వితీయ దేవుడా .. ఆరాధ్య దైవమా..(2) సరిలేరు సరిపోరూ నీకిల యేసయ్యా.. సరిరారు సరికారు సమానులెవరయ్యా...(2)

2వ చరణం

మార్గము నేనే.. సత్యము నేనే.. జీవము నేనే ననినా ఏకైక దైవమా..(2) సరిలేరు సరిపోరు నీకిల యేసయ్యా.. సరిరారు సరికారు సమానులెవరయ్యా..(2)

3వ చరణం

దవళ వర్ణుడా... రత్న వర్ణుడా... పదివేల లోన అతి సుందరుడా...(2) సరిలేరు సరిపోరూ నీకిల యేసయ్యా... సరిరారు సరికారు సమానులెవరయ్యా..(2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.