యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా తెలుపుము

yeesayyaa.. nannenduku ennukunnaavayyaa thelupumu

🎵 TG-2344🌐 Telugu
పల్లవి

యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా తెలుపుము నీ చిత్తము నా యెడల – (2)     ||యేసయ్యా||

1వ చరణం

ఏ దరి కానక తిరిగిన నన్ను నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2) ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా||

2వ చరణం

చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను నీ జీవము నొసగి బ్రతికించావయ్యా ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల ఏమి నీ దయ నా యెడల శోధనా బాధలో కృంగిన నన్ను నిరీక్షణ నొసగి బలపరచావయ్యా ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల ఏమి నీ ఆశ నా యెడల

Report Error