యేసయ్యా నీ దయను బట్టే ఇలా ఉన్నానయ్యా
yeesayyaa nee dayanu battee ilaa unnaanayyaa
యేసయ్యా నీ దయను బట్టే ఇలా ఉన్నానయ్యా.. యేసయ్యా నీ కృపను బట్టే ఇలా ఉన్నానయ్యా... (2) నీ కృప లేకుండ నేను ఒక్క అడుగువేయలేనయ్య.. (2) యేసయ్యా.. నా... యేసయ్యా యేసయ్యా నా... యేసయ్యా (2) ||యేసయ్యా||
నీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావయ్య.. నీ ప్రేమ లేకపోతే నేను జీవించలేనయ్య... ప్రేమ స్వరూపుడా నీకే వందనం.. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రము (2) ||యేసయ్యా||
2.కృపవెంబడి కృపతో నన్ను నడిపించుచున్నావయ్య.. నీ కృప నా యెడల హెచ్చుగా ఉన్నదయ్యా.. నీ కృపను బట్టే నేను ఇలా బ్రతుకుచున్నానయ్య నీ కృపే లేకపోతే నేనేమైపోదునో.. (2) ||యేసయ్యా||
నీ సెలవు లేకుండా నేను భోజనం చేయలేనాయ్య.. నీ సెలవు లేకుండ నేను సంతోషింపలేనయ్య... నేను ఇలలో ఉన్నానంటే కేవలం నీ కృప నేను బ్రతికి యున్నాను అంటే కేవలం నీ కృపే..(2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
