యేసయ్యా ప్రాణ నాథా
yeesayyaa praanna naathaa
🎵 TG-2860🌐 Telugu
పల్లవి
యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా సిలువలో ప్రాణం పెట్టినావయ్యా రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా మరణాంధకారములో పడియున్న వేళ ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2) కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా||
1వ చరణం
మరణ పాశాలన్ని ఛేదించినావు ప్రేమ పాశాలతో దీవించినావు నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు రానున్న రారాజు నీ వధువు నేను