♪♫
TG-1836
Telugu
యేసే గొప్ప దేవుడు
yeesee goppa deevudu
85
views
పల్లవి
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2) యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||
1వ చరణం
మహా శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగ నిలచిన యోబు వలె నే జీవించెదను అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
2వ చరణం
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలె నే జీవించెదను అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.