TG-5634
Telugu

యేసే నా నిజ రక్షకుడు యేసు నా ప్రాణ ప్రియుడు

Yeesee Naa Nija Rakshakudu Yeesu Naa Praana Priyudu

0
views
పల్లవి

యేసే నా నిజ రక్షకుడు - యేసు నా ప్రాణ ప్రియుడు (2) స్తుతి పాటలు పాడెదను - జగమంతా చాటెదను యేసే నా నిజ రక్షకుడు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4) యేసు నాకు జీవమునిచ్చాడు - మరణముపై జయమునిచ్చాడు (2) చప్పట్లు కొట్టెదను - జయధ్వనులు చేసెదను యేసే నా నిజ రక్షకుడు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4) యేసు నాకు శాంతినిచ్చాడు - శాపములనుండి విడిపించాడు (2) గంతులేసి ఆడెదను - ఆర్భాటము చేసెదను యేసే నా నిజ రక్షకుడు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4 ) యేసు నాకు శక్తినిచ్చాడు అభిషేకంతో నన్ను నింపాడు (2) సువార్తను చాటెదను - క్రీస్తు కొరకు బ్రతికెదను యేసే నా నిజ రక్షకుడు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4)