♪♫
TG-2929
Telugu
యేసే నీ మదిలో ఉండగా
yeesee nee madiloo undagaa
86
views
పల్లవి
యేసే నీ మదిలో ఉండగా కలతే దరి చేరగ రాదుగా (2) సోదరా సోదరీ.. యేసులో నెమ్మది ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే||
1వ చరణం
తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా నీ చెంతకు చేరి నిలుపును నీ చింతను తీర్చి నడుపును సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే||
2వ చరణం
సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా సహింపలేని శోధనలను నీకు దయచేయునా శోధనలను గెలిచే మార్గము తప్పక నీకొసగును తథ్యము సోదరా సోదరీ.. యేసులో విజయము సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.