యేసు దేవా నను కొనిపోవా

yeesu deevaa nanu konipoovaa

🎵 TG-2921🌐 Telugu
పల్లవి

యేసు దేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా (2) శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నీదు శక్తినిమ్మయా అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు||

1వ చరణం

ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)         ||యేసు||

2వ చరణం

నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను

Report Error