యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా
yeesu deevuni aashrayinchumaa soodaraa
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు||
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును యేసుని ప్రార్థించుము శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధార్ధతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహనము చూపుము సమకూడి జరుగును యేసు నందు నిరీక్షించుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.