♪♫
TG-2036
Telugu
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
yeesu kreesthuni manchi shissyulamugaa
80
views
పల్లవి
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము (2) మనమందరము ఆయన సేవను ఏకమై సదా జేసెదం మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును అతి వేగముగా సేవ చేతుము ||యేసు క్రీస్తుని||
1వ చరణం
అందరి యెడల ప్రేమ జూపెదం యేసు చెంతకు పిలిచెదము అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము ||మన యేసు||
2వ చరణం
సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలిచియుండి ప్రభు దినమందు హర్షింతుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.