యేసు నామామృతము కన్నను వేరే

yeesu naamaamruthamu kannanu veeree

🎵 TG-136💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు నామామృతము||

1వ చరణం

నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము సతము గ్రోలుట కొసఁగెను ||యేసు నామామృతము||

2వ చరణం

దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా ||యేసు నామామృతము||

3వ చరణం

గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని రక్షణ సృష్టిలో మము నిల్పెను ||యేసు నామామృతము||

4వ చరణం

అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు నామామృతము||

Report Error