యేసు నామం బెత్తి పాడుదమ

yeesu naamam beththi paadudama

🎵 TG-433💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో ఁ బొత్తుఁ గూడు దమ ||యేసు నామం||

1వ చరణం

ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ బాలింతమ ||యేసు నామం||

2వ చరణం

శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ ||యేసు నామం||

3వ చరణం

దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ ||యేసు నామం||

4వ చరణం

మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ ||యేసు నామం||

5వ చరణం

జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు నామం||

6వ చరణం

మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ బెరుకుదమ ||యేసు నామం||

7వ చరణం

పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు దమ ||యేసు నామం||

8వ చరణం

సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు నామం||

9వ చరణం

దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు నామం||

10వ చరణం

గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు గుదమ ||యేసు నామం||

Report Error