♪♫
TG-346
Telugu
యేసు నావాడని నమ్ముదున్ భాసిల్లు
yeesu naavaadani nammudun bhaasillu
207
views
పల్లవి
యేసు నావాడని నమ్ముదున్ భాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుఁడ నౌచు పాల్పొందెదన్ నాశంబు లేని సౌఖ్యంబును. ||యేసు నావాడని||
1వ చరణం
సంపూర్ణ భక్తితో నుండెదన్ పెంపార యేసున్ ధ్యానించెదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును. ||యేసు నావాడని||
2వ చరణం
నిండైన భక్తియే నెమ్మది గెల్చున దేమి యేసుండఁగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు దండిగ బ్రేమన్ సుఖింతును. ||యేసు నావాడని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.