యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు నాయకుఁడ||
రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు నాయకుఁడ||
హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు నాయకుఁడ||
కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో ||యేసు నాయకుఁడ||
మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు నాయకుఁడ||
చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా ||యేసు నాయకుఁడ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.