పల్లవి
యేసు, నీ సదాత్మ వృష్టి భక్తు లెల్లవారిపై నీవు కుమ్మరింపఁగాను నాపైఁ గుమ్మరించుమీ. ||యేసు, నీ||
1వ చరణం
తండ్రి, నన్ను దాఁటవద్దు పాపి నంచు వేఁడెదన్ నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీ ||యేసు, నీ||
2వ చరణం
రక్షకా, నన్ దాఁటి పోకు నేను నిన్ను నమ్మితిన్ నీదు దయ పూర్తిగాను నాపైఁ గుమ్మరించుమీ. ||యేసు, నీ||
3వ చరణం
పావనాత్మ, దాఁటి పోకు నేను గుడ్డివాఁడను జ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ. ||యేసు, నీ||
4వ చరణం
మాఱనట్టి దైవ ప్రేమ. క్రీస్తు రక్త పుణ్యము పావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ. ||యేసు, నీ||
5వ చరణం
నన్ను దాఁటిపోక యేసు నీకు సేవచేయ నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ ||యేసు, నీ||