యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే

yeesu parishuddha naamamunaku eppudu adhika sthoothramee

🎵 TG-1198🌐 Telugu
పల్లవి

యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే

1వ చరణం

ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు||

2వ చరణం

సైతానున్‌ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది జయమొందెదము ఈ నామమున (2) ||యేసు||

3వ చరణం

నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు||

4వ చరణం

ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించు నామమిది (2) ||యేసు||

5వ చరణం

శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు||

Report Error