యేసు ప్రభువా నీవే మహిమా
yeesu prabhuvaa neevee mahimaa
🎵 TG-2408🌐 Telugu
పల్లవి
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు||
1వ చరణం
గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి నిశ్చయముగా నిన్ను చూతును యేసు ప్రభో జయహో (4) ||యేసు||
2వ చరణం
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును యేసు నీతో సదా (2) ||యేసు||