♪♫
TG-5627
Telugu
యేసు ప్రేమనే చూపిద్దాం యేసు లాగనే జీవిద్దాం
Yeesu Preemanee Choopiddaan Yeesu Laaganee Jeeviddaan
0
views
పల్లవి
యేసు ప్రేమనే చూపిద్దాం - యేసు లాగనే జీవిద్దాం లోకాన్నే మార్చేద్దాం... చలో యేసు వార్తనే చాటేద్దాం - నశించు ఆత్మను మార్చేద్దాం యేసు సువార్తను ప్రకటిద్దాం... బోలో అ.ప: యేసయ్య సాక్షిగా జీవించుదాం - తన చిత్తం నెరవేర్చుదాం (2) యేసే రారాజని సర్వలోకానికి - ఎలుగెత్తి చాటించుదాం... (2) ||యేసు||
1వ చరణం
యేసయ్య నామం ముక్తికి మార్గం - యేసయ్య సన్నిధి సంతోషం యేసయ్య వాక్యం జీవాహారం - యేసయ్యే మనకు ఆధారం ||యేసయ్య||
2వ చరణం
యేసయ్య చరణం పాపికి శరణం - యేసయ్య చిత్తం చిరజీవం యేసయ్యే మార్గం సత్యం జీవం - యేసయ్య వలనే పరలోకం యేసయ్య రాకకు సిద్ధపడుదాం - ఆత్మలను సిద్ధపరచుదాం (2) యేసే రారాజని సర్వలోకానికి - ఎలుగెత్తి చాటించుదాం (2) ||యేసయ్య||