యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరి నందు
Yeesu Puttenu Kanya Mariyaku Bethleheemu Oori Nandu
యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరి నందు లోకానికి అరుదెంచెను ఆ పశులశాలయందు ప్రవచనమే నెరవేరెను పరిస్థతులే మారిపోయెను ||యేసు పుట్టెను||
చీకటిలో ఉన్న జనులకు గొప్ప వెలుగుదయించెను మరణములో ఉన్న వారు జీవములోనికి దాటెను మనలను రక్షించుటకు మానవునిగా భువికి దిగి వచ్చెను ||యేసు పుట్టెను||
ఆశ్చర్యకరుడుగా వచ్చెను ఆలోచనా మనకు చెప్పెను శరీరధారియై వచ్చెను కృపాసత్యముతొ నిండెను బలవంతుడుగా నిత్యుడగు తండ్రిగా సమాధానా అదిపతిగా ||యేసు పుట్టెను||
నేడే నీ మనసు మార్చుకో నీకై వచ్చెనని తెలుసుకో నమ్మినవారికి రక్షణ సిద్ధము చేసెను దేవుడు విశ్వాసముంచుము ఆ యేసునందు నిత్యజీవము నీకొసగును ||యేసు పుట్టెను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.