TG-5628
Telugu

యేసు రాజు పుట్టాడంట ఊరువాడ సంబరమంట రారండో

Yeesu Raaju Puttaadanta Ooruvaada Sanbaramanta Raarandoo

21
views
పల్లవి

యేసు రాజు పుట్టాడంట ఊరువాడ సంబరమంట రారండో నింగి నేల పరవశించి గంతులు వేసి ఆడేనంట చూడండో (2) లేఖనాల నెరవేర్పే యేసు రాజు పుట్టుకంట అంబరాన్ని తాకేనంట ఈ సంబరమే దివి భూమి ఏకమయ్యే ఈనాడు లోకాలనేలే రాజు పుట్టాడు జగమే కంపించే ఈనాడు అంతా సంతోషం ప్రతిరోజు పరమును విడిచిన పరమాత్ముడు పాపము ఎరుగని పరిశుద్ధుడు మరియకు సుతునిగా మనుజుడై భువికరుదించిన బగవంతుడు (2) అంధకారమునే అంతము చేయగా సర్వ జగతికి ప్రేమను పంచగా (2) దివిని విడచి ధరనణికొచ్చాడు చరితకు యేసే కొలమానము దీనిలో లేదు అనుమానము యేసే మోక్షానికి మార్గము నమ్మితే ఆయన నీ సొంతము క్రీస్తుని జననము - ఇల ప్రత్యేకము విడువము పాపము - ప్రభువును నమ్ముము తారగ దివినందు వెలుగుము ||దివి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.