యేసు రాజు రాజుల రాజై
yeesu raaju raajula raajai
🎵 TG-2110🌐 Telugu
పల్లవి
యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||
1వ చరణం
యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా||
2వ చరణం
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా యేసు గాయముల్ స్వస్థపరచున్ రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా||
3వ చరణం
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండె