యేసు రక్తమే జయము జయమురా

yeesu rakthamee jayamu jayamuraa

🎵 TG-2248🌐 Telugu
పల్లవి

యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2)              ||యేసు||

1వ చరణం

బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2) శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యువునే గెలుచు రక్తము పాతాలం మూయు రక్తము నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు||

2వ చరణం

పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు? ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు సాతాన్నే నలగ్గొట్టిన వాడి తలనే చితగ్గొట్టిన కొదమ సింహమై మేఘారూఢిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే

Report Error