యేసు వస్త్రపు చెంగును మాత్రమే
yeesu vasthrapu chengunu maathramee
యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ ||యేసు వస్త్రపు||
గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు వస్త్రపు||
అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు ||యేసు వస్త్రపు||
ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు వస్త్రపు||
ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు వస్త్రపు||
ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును ||యేసు వస్త్రపు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.