TG-3015
Telugu

యేసుకే అంకితం నా ప్రాణం సర్వము

yeesukee ankitam naa praanam sarvamu

KJW Premబ్రో. అవినాష్ · Bro. Avinashఆనంద్ పలివెల · Anand Palivela
11
views
Chorus

ఓ యేసుకే అంకితం నా ప్రాణం సర్వము ప్రభు యేసుకే అంకితం నా జీవిత సమస్తము (2) హో.. హో.. హో.. నీ సన్నిధిలో నేను చేయు ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరమిచ్చితివే ఇరుకులో నాకు విశాలతను కలుగజేసి నను కరుణించి నా ప్రార్ధన వింటివే ||యేసుకే||

1వ చరణం

మునుపున్న వాటిని జ్ఞాపకము చేసికొనక పూర్వకాల సంగతులు తలంచుకొనక (2) ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాననంటివే కరుణాతిశయముతో నను కారుణించితివే (2) కరుణాతిశయముతో నను కారుణించితివే… ||యేసుకే||

2వ చరణం

వెనుకున్నవన్నీ మరచి ముందున్నవన్నీ తలచి పరుగెత్తెదను నీ రక్షణ కొరకు నేను (2) నా ప్రతీ బాష్ప బిందువును తుడిచెదను అంటివే నీ దక్షిణ హస్తముతో దీర్ఘాయువునిచ్చితివే (2) నీ దక్షిణ హస్తముతో దీర్ఘాయువునిచ్చితివే.. ||యేసుకే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.