యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు
yeesunaadhuni yoodhulandaru vaasiga nitarandu
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ నిటరండు భాసురముగ ప్రభు జన్మము బాడుచు నాసతోడ రండు వేగమె యాసతోడ రండు ||యేసునాధుని యోధులందరు||
దూతలమాదిరి గాత్రము లెత్తుచు గీతము బాడుండి వేగము గీతము బాడుండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుండి వేగమె ఖ్యాతిగ బలుకుండి ||యేసునాధుని యోధులందరు||
గొల్లల ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుండి వేగమె యెల్లరు నడువుండి ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లెడ దెలుపుండి వేగమె యెల్లడ దెలుపుండి ||యేసునాధుని యోధులందరు||
జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||యేసునాధుని యోధులందరు||
మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||యేసునాధుని యోధులందరు||
జయజయ శబ్దము జేయుచు ప్రభునకు జయమని పాడుండి వేగమె జయమని పాడుండి జయజయ మంచును జయ శబ్ధముతో జయముల నొందుండి వేగమె జయముల నొందుండి ||యేసునాధుని యోధులందరు||