TG-3407
Telugu

యేసుని ప్రకటించూ ఆత్మలను రక్షించూ

yeesuni prakatinchoo aatmalanu rakshinchoo

Daniel JohnJesus Chanan MinistriesBro.Prakash Garu · PrakashBro.Prabhu Bushan Garu
0
views
Chorus

యేసుని ప్రకటించూ ఆత్మలను రక్షించూ పౌలు వలే విస్తార ఆత్మలు క్రీస్తుకొరకు సమకూర్చు హల్లెలూయ ||యేసుని||

1వ చరణం

స్తెఫనుపై తమ పళ్ళు కొరికిరీ రాళ్ళతో హింసించిరీ అయిననూ దేవుని కుడిపార్శమున ప్రభువుని చూచెను ||యేసుని||

2వ చరణం

యాకోబును బహుబాధ పెట్టిరీ ఖడ్గముతో చంపించిరీ అయిననూ పేతురు చెరసాలలో ప్రభుని కలిసెను ||యేసుని||

3వ చరణం

తోమాను బళ్ళెముతో పొడిచిరీ పరుగులు పెట్టించిరీ అయిననూ క్రీస్తుకు హతసాక్షియై మనకు మాదిరి చూపెను ||యేసుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.