యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప

yeesuni seevinpa dayacheesithivi preemasvaruupa

🎵 TG-476💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని సేవింప||

1వ చరణం

ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని సేవింప||

2వ చరణం

శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన ||యేసుని సేవింప||

3వ చరణం

పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి ||యేసుని సేవింప||

4వ చరణం

సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి ||యేసుని సేవింప||

5వ చరణం

తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా ||యేసుని సేవింప||

6వ చరణం

చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన ||యేసుని సేవింప||

7వ చరణం

లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా ||యేసుని సేవింప||

Report Error