యేసుని తిరు హృదయమా నన్ను
yeesuni thiru hrudayamaa nannu
🎵 TG-1370🌐 Telugu
పల్లవి
యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా (2) స్నేహితుని వోలె ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు (2) ||యేసుని||
1వ చరణం
కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు దుఃఖంలో నా కన్నీరు తుడిచావు ఏ విధమున నిన్ను నే పొగడగలను నీ ఋణమును నేనెలా తీర్చగలను నా తండ్రి నా దేవా ||యేసుని||
2వ చరణం
నను కాచి కాపాడే నా మంచి కాపరివి నాకింక భయమేల నీ అండదండలలో జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక నీ ఆత్మతో దీవించు నా యేసు