TG-361
Telugu

యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని

yeesuprabhukai saakssulevarevaroo evvarevvaroo yani

201
views
పల్లవి

యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో ప్రభు వడుగుచున్నాడు యేసు కొరకై నిల్చి క్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు భాసురంబుగ క్రీస్తు నెంతో భారతీయులు ప్రస్తుతించరో ||యేసుప్రభుకై సాక్షులెవరెవరో||

1వ చరణం

దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో ||యేసుప్రభుకై సాక్షులెవరెవరో||

2వ చరణం

రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ ||యేసుప్రభుకై సాక్షులెవరెవరో||

3వ చరణం

థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ ||యేసుప్రభుకై సాక్షులెవరెవరో||

4వ చరణం

పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ ||యేసుప్రభుకై సాక్షులెవరెవరో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.