యేసూ, నా ప్రభువా, నీ

yeesuu, naa prabhuvaa, nee

🎵 TG-427💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు విశ్రాంతి నియ్యదు. ||యేసూ, నా||

1వ చరణం

యేసూ, రేబగుళ్లు నా యొద్ద నుండుము నాతో నీవుండిన నే భయ ముండదు. ||యేసూ, నా||

2వ చరణం

సుఖంబుఁ బొందఁగా నిన్నే యాశింతును దుఃఖంబు నొదఁగా నీవే శరణ్యము. ||యేసూ, నా||

3వ చరణం

నీ మార్గమందున నే నడ్వ నేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము. ||యేసూ, నా||

4వ చరణం

నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాఁడనై నన్నుండఁ జేయుము. ||యేసూ, నా||

Report Error