యేసూ నా యాత్మ రక్షకుండ

yeesuu naa yaathma rakssakunda

🎵 TG-419💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి ||యేసూ నా||

1వ చరణం

జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు ||యేసూ నా||

2వ చరణం

ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము ||యేసూ నా||

3వ చరణం

నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము ||యేసూ నా||

4వ చరణం

యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి ||యేసూ నా||

5వ చరణం

నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి ||యేసూ నా||

6వ చరణం

నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము ||యేసూ నా||

7వ చరణం

నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా ||యేసూ నా||

Report Error